Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Toddy Fruit Recipe: తాటిముంజుల గురించి అందరికీ తెలిసిందే..? వీటి గురించి దాదాపు అందరికీ తెలుసు.. కానీ తాటి పండ్లు.. వాటితో చేసుకునే వంటకాల గురించి విన్నారు.. కేవలం రుచిగా ఉండడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..? తెలిస్తే షాక్ అవుతారు..?
Toddy Fruit Recipe: నేటి జనరేషన్ కు పెద్దగా తాటి సంపద గురించి పెద్దగా తెలియదు.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే యువతకు సైతం పెద్దగా ఈ తాటి సంపద గురించి తెలియదు.. కేవలం తాటి ముంజులు గురించి మాత్రమే అందరికి తెలుస్తుంది. ఎందుకంటే వేసవి కాలం వచ్చిందంటే.. నగరాల్లో సైతం వీధి వీధిలో తాటి ముంజుల అమ్మకాలు సాగుతాయి. చాలామంది ఇష్టంతో తింటారు కూడా.. అయితే తాటి సంపద అంటే కేవలం ముంజులు మాత్రమే కాదు.. తాటిపండ్లు, తేగలు, కళ్లు ఇలాచాలానే ఉన్నాయి. అయితే వీటితో ప్రయోజనాలుకూడా చాలానే ఉన్నాయి. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ తాటిపండుతో కడుపునింపుకునే వారు. కొందరు వేడి చేసుకుని మరికొందరు ఈ పండును అలానే తినేవారు. కానీ చేతికి, మూతికి అంటుకుంటోందని క్రమేపీ దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు నేరుగా ఆ పండ్లను తినేవారి సంఖ్య తగ్గింది అనే చెప్పాలి. కేవలం గ్రామాల్లో మాత్రం అది కూడా పెద్ద వయసు వారు మాత్రమే ఇప్పటికే తాటి పండ్లను తింటున్నారు. దాని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేనా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా. నేరుగా ఈ తాటి పండును నలబై 40 రోజుల పాటు రోజుకి ఒకటి చొప్పున తింటే చర్మం మెరిసిపోతుంది. యవ్వనం ఉట్టిపడుతుంది అంటున్నారు.
కేవలం తాటి పండు మాత్రమే కాదు.. పండుతో తయారు చేసే వంటకాలు అంతే రుచిగానూ, అంతకంటే ఆరోగ్య ప్రధాయినిగానూ ఉంటున్నాయి. ప్రస్తుత సీజన్లో లభ్యమయ్యే తాటి పండు గురించి తెలుసుకోవడం అవసరం కూడా.. ఎందుకంటే ఇది ఎన్నో పోషకాలు కలిగి ఉంది. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజంగ లభించే పండు ఇది. మగ్గడానికి రసాయనాలు వినియోగించే ప్రసక్తే లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మరీ ముఖ్యంగా కోనసీమ ప్రాంతాల్లో ఈ పండుతో తయారు చేసే వంటకాలకు డిమాండ్ పెరుగుతుంది.
ఈ తాటి పండు గుజ్జు నుంచి తయారు చేసే గారెలు, బూరెలు, ఇడ్లీలు, దిబ్బరొట్టెలు వంటి ఎన్నో వంటకాలు రుచిచూడడానికి పోటీ పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఈ తాటిపండుతో తయారు చేసిన వంటకాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అలసి పోయి ఇంటికి వచ్చిన ఇంటి పెద్దలకు.. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన విద్యార్థులకు ఇంట్లో అమ్మ నాన్నమ్మలు చేసి పెట్టే వంటకమే తాటి పండు వంటకం.
ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ సిటీలో కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక తాటి పండు ధర 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనకుండా ఉచితంగానే ఈ పండ్లు దొరుకుతున్నాయి. బాగా పండిన తరువాత సహజంగానే చెట్లపై నుంచి ఈ పండ్లు రాలి పడిపోతాయి. అలా చూసిన వాటిని తెచ్చుకుని.. మీకు నచ్చిన విధంగా నేరుగా తిన్నా.. లేదా ఇలా వంటకంలా అయినా ట్రై చేయొచ్చు.
అన్నిటికన్నా ముఖ్యంగా తాటి రొట్టె చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వర్షకాలం సీజన్లోవచ్చే ఈ తాటిపళ్ళు ఎన్నో అద్భుతమైన మన పల్లెటూరు రుచులను అందిస్తాయి. వీటితో రొట్టెలు, ఇడ్లీలు, గారెలు లాంటివి చేసుకుంటారు కూడా. తాటి పళ్ళను పూర్తిగా శుభ్రం చేసి దాని గుజ్జు తీశాక. సరిపడా వరి నూక , కొద్దిగా బెల్లం, కొబ్బరి తురుము, యాలికకాయాల పొడి కలిపి నాలుగైదు గంటలు నాన బెట్టుకుని, చిన్న మంటపై మూకుడులో రొట్టెల్లా వేసి కింద నుండి కాసంత సెగ తగిలించేది పైన ఒక అరిటాకును బోర్లించి కింద పొయ్యిలో ఉన్న నిప్పుల్ని అరిటాకు మీద వేసి కొంచం సేపు కాలాక ఆ నిప్పులు తీసివేశాక.. దిబ్బరొట్టె రెడీ అవుతుంది. ఇక అది తింటే ఆ టేస్టే వేరు అనాల్సిందే?
Comments
Post a Comment