Astro Tips: కొబ్బరికాయతో అదృష్టం మార్చుకోవచ్చా? ఇలా చేయండి!

 Astro Tips: జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారా? ముఖ్యంగా ఆర్థిక లేక.. కుటుంబపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా..? అయితే ఆ సమస్యలకు కొబ్బరి కాయలతోనే మీ అదృష్టం మార్చుకోవచ్చని తెలుసా..? మరోవైపు ప్రస్తుతం ఏపీలో భారీగా కొబ్బరికాయల రేట్లు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారో ఎందుకో తెలుసా..? 

Astro tips for Coconut: సాధారణంగా ఏ పూజ చేసిన, శుభకార్యం మెుదలుపెట్టినా కచ్చితంగా ఉండాల్సిన వాటిలో కొబ్బరి కాయ ఒకటి. కొబ్బరికి హిందువులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ప్రతి దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో కొబ్బరి ఒకటి.. అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి..  జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చని మీకు తెలుసా? సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని శ్రీఫలం అని కూడా అంటారు. టెంకాయ లేదా కొబ్బరికాయ (Coconut) కొట్టకుండా ఈ పూజ, శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,  ఎవరి జాతకంలోనైనా గ్రహా దోషాలు, అడ్డంకులను తొలగించడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెబుతారు.. అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయ తప్పని సరిగా పెడతారు. ఏ దేవుడ్ని ఆరాధించినా.. ప్రత్యేక పూజలు చేసినా కొబ్బరితోనే వారిని ప్రసన్నం చేసుకోవచ్చు.. అయితే కొబ్బరి కాయలతో.. కొన్ని విధాలుగా మొక్కులు సమర్పించడం ద్వారా.. జీవితంలో ఉండే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు.
 
కొబ్బరి కాయతో ఈ పరిహారాలు చేయండి
జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్లయితే.. పరిహారంగా కొబ్బరికాయను పై నుండి 21 సార్లు తిప్పి దేవాలయంలోని అగ్నిగుండంలో కాల్చాలి.. ఈ పద్ధతిలో ప్రతి మంగళవారం లేదా శనివారం రోజున ఇలా 5 వారాలపాటు చేయాలని చెబుతున్నారు. అలా చేస్తే కచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయట పడొచ్చంట.. 

అలాగే ఉద్యోగ లేదా వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే, ఇంట్లో కొబ్బరి చెట్టును నాటాలని చెబుతున్నారు. దీంతో మీ జాతకంలో గురు గ్రహం బలపడుతుందని.. ఇది  శుభ ఫలితాలను ఇస్తుంది అని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా త్వరలో మీరు అనుకున్న పని నెరవేరుతుందంటున్నారు.

ఈ రెండు పరిహారాల ద్వారా ఇంట్లో ధనం పెరుగుతుంది అంటున్నారు పండితులు. అలాగే ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో కొబ్బరి చెట్టును నాటడంతో ఉత్తమ ఫలితాలుకనిపిస్తాయి అంటున్నారు. అలాగే మంగళవారం నాడు కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి, వ్యక్తి పై నుండి 7 సార్లు తిప్పి... హనుమంతుని పాదాల దగ్గర పెడితే.. ఇతరుల చెడు దృష్టి పోతుందంటున్నారు.
 
శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. ఆ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను కొట్టాలని సూచిస్తున్నారు. మరుసటి రోజు ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టి, బయటి వారికి కనిపించకుండా ఇంట్లోని ఓ ప్రదేశంలో ఉంచాలి.  ఈ పరిహారంతో ఆర్థిక కష్టాలు తీరుతాయి అంటున్నారు. 

అలాగే ఎంత కష్టపడి పనిచేసినా కెరీర్ లో పురోగతి లేకపోతే... శనివారం రోజున  శనిదేవుడి ఆలయానికి వెళ్లి 7 కొబ్బరి కాయలు కొట్లాలి అంటున్నారు. ఆ కొబ్బరి పెచ్చులను తీసి నదిలో ముంచాలి.  అలా చేయడంతో జీవితంలోని అడుగడుగునా ఎదురవుతున్న సమస్యలు ఈజీగా దాటే అవకాశం ఉంటుంది అంటున్నారు.  

Comments

AATVNEWS

SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?

AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?

Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..