Ganesh Chaturthi 2022: చంద్రుడు ప్రతిష్టించిన గణేషుడు గురించి విన్నారు.. మనసారా కోరుకుంటే మీ సమస్యలు తీరినట్టే..
Ganesh Chaturthi 2022: వినాయక చవితి అంటే అందరికీ గుర్తు వచ్చేది చంద్రుడి కథే.. మరి చవితి పర్వదినం పురస్కరించుకుని సాక్షాత్తు ఆ చంద్రుడే ప్రతిష్టించిన గణపయ్య గురించి మీకు తెలుసా..? అంతేకాదు బెల్లం గణేషుడిగా గుర్తింపు పొందిన ఈ స్వామిని ఏదైనా కోరుకుంటే.. వెంటనే ఆ కోరిక తీరుతుంది అంట..
Bellam Ganapathi: రేపే వినయాక చతుర్ధి.. (Ganesh Chathurthi) దేశ వ్యాప్తంగా వినయక ఆలయాల్లో ప్రత్యేక పూజలతో నవరాత్రులూ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే విఘ్నాలు తొలగించే వినాయకుడు.. నైవేజ్యం పేరుతో భక్తులు పత్రం, ఫలం ఏది ఇచ్చినా ఒదిగిపోయే గణపయ్య ఎన్నో రూపాల్లో పూజులు అందుకుంటున్నాడు. వినాయక చవితి అంటే అందరికీ గుర్తు వచ్చేది చంద్రుడి కథే.. మరి చవితి పర్వదినం పురస్కరించుకుని సాక్షాత్తు ఆ చంద్రుడే ప్రతిష్టించిన గణపయ్య గురించి మీకు తెలుసా..? సాక్ష్యాత్తు చంద్రుడే వచ్చి బెల్లం వినాయకుడిని ప్రతిష్టించినట్టు పురాణాలు, పూర్వికుల మాట. అయితే బెల్లం వినాయకుడి (Jaggery Ganapathi)గా పూజలందుకుంటున్న ఈ గణపయ్య విశాఖపట్నంలో కొలువుదీరాడు. అసలు బెల్లం వినాయకుడు అని పేరు వినగానే ఏంటి గణపయ్యకు ఈ పేరు కూడా ఉందా అని ఆశ్చర్యపోకండి.. విశాఖ వాసులకు ఈ బెల్లం గణపతి గురించి బాగా తెలుసు. అన్ని విగ్రహాలు ఒకలా ఉంటే బెల్లం వినాయకుడు మాత్రం ప్రత్యేకంగా ఉంటాడు. కనువిందు చేయటమే కాదు కల్పవల్లిగా పూజలందుకుంటున్నాడు. విశాఖపట్నం కొత్త జాలరి పేటలో వెలసిన ఈ బెల్లం వినాయకుడి చాలా విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. అంతేకాదు గణపతి నవరాత్రుల సమయంలో ఈ స్వామికి మొక్కుకుంటే.. కోరికలు ఏవైనా ఇట్టే తీరిపోతాయట.. ఈ విగ్రహం అన్ని రూపాలకన్నా భిన్నంగా ఉంటుంది. స్వామివారి తొండం ఇక్కడ కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరి.. ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ బెల్లం గణపతిని ఆనంద గణపతి అని కూడా పిలుస్తారు. పలువురు ప్రముఖులు కూడా సక్సెస్ కోసం ఈ వినాయకుడ్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ గణనాథుడు కేరళ తరహాలో తాంత్రిక పూజలందుకుంటాడని పూజారులు చెబుతున్నారు. ఆనంద గణపతి పక్కనే రామలింగేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఈ బెల్లం గణేషుడు మహిమలు తెలియడంతో.. కేవలం విశాఖ నుంచి కాదు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. వినాయక నవరాత్రుల్లోనే కాదు, ప్రతి బుధవారం ఈ పార్వతి తనయుడికి స్థానికులు బెల్లం సమర్పిస్తారు. అందుకే దేవాలయం చుట్టూ బెల్లం అమ్మే వర్తకులు భారీగా ఉంటారు. ఉదయం ఆరు నుంచి పదకొండున్నర వరకు మళ్లీ సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామిని దర్శించుకుంటారు. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దలంలో చోళరాజులు కట్టినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయానికి ఎదురుగా సముద్రం ఉంటుంది. ఈ సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు పేరుతో ఉన్న ఈశ్వరుడ్ని దేవతలు ప్రతిష్టాంచారని పురాణాలు చెబుతున్నాయి. ఈశ్వరుడ్ని దేవతలు నిత్యం పూజించేవారట. కాల క్రమంలో సముద్రం ముందుకు చొచ్చుకురావటంతో వైఖాశేశ్వరుడు దేవాలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. దీంతో చంద్రుడు తీవ్ర ఆవేదన చెందాడని పూర్వీకులు చెబుతుంటారు. అలా కలత చెందిన చంద్రుడు.. ఎంతో భక్తితో శివుడి గురించి ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడని.. అప్పుడు చంద్రుడు శివుడిని అయ్యా..నీ దేవాలయం సముద్రంలో కలిసిపోయింది..కాబట్టి నువ్వు ఇక్కడ వెలిసి భక్తులతో పూజలందుకోవాలని కోరాడని.. దానికి శివుడు వినాయకుడు దేవాలయం వద్ద స్వయంభూవుగా వెలిశాడని చెపుతారు. దీంతో శివుడికి గుడి కట్టిన చంద్రుడు. ఆయన కుమారుడైన వినాయకుడికి కూడా దేవాలయాన్ని నిర్మించాడని పూర్వీకులు చెబుతుంటారు. అంతేకాదు ఈ గణపతికి ప్రసాదంగా బెల్లం పెడతారు. అలా బెల్లం గణపతిగా పేరొందాడీ గణపయ్య. వినాయకుడి శిరస్సు ఏనుగు శిరస్సు అనే విషయం తెలిసిందే. ఏనుగుకు చెరుకు అంటే చాలా ఇష్టం అనే విషయం కూడా తెలిసిందే. అందుకే ఈ వినాయకుడికి చెరుకుతో తయారుచేసేటటువంటి బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. ఇవీ ఈ బెల్లం వినాయకుడి విశేషాలు.
Bellam Ganapathi: రేపే వినయాక చతుర్ధి.. (Ganesh Chathurthi) దేశ వ్యాప్తంగా వినయక ఆలయాల్లో ప్రత్యేక పూజలతో నవరాత్రులూ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే విఘ్నాలు తొలగించే వినాయకుడు.. నైవేజ్యం పేరుతో భక్తులు పత్రం, ఫలం ఏది ఇచ్చినా ఒదిగిపోయే గణపయ్య ఎన్నో రూపాల్లో పూజులు అందుకుంటున్నాడు.
Comments
Post a Comment