Tirumala: భక్తులకు అలర్ట్.. తిరుమలలో సెప్టెంబర్ లో విశేష పర్వదినాలు ఎన్నో..? బ్రహ్మోత్సవాలు ఎ్పపటి నుంచి అంటే..?
Tirumala:కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మరోవైపు రాబోయే సెప్టెంబర్ నెలలో చాలా పర్వదినాలు ఉన్నాయి.. ఆ పర్వదినాలు ఏంటి.. ఎలాంటి సేవలు నిర్వహిస్తారో తెలుసుకుందాం..
Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ శ్రీనివాసుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (TirumalaTemple). శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే (Tirumala Sri Vari Darshan) అంతా మంచేజరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే నిత్యం తిరుమల గిరిలు రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి విపరీతమైన పోటీ ఉంటుంది. అందుకే బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది.. కరోనా కారణంగా గత రెండేళ్లూ ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam). ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీవరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు కేవలం సర్వదర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ చరిత్రంలో తొలిసారి రద్దుచేయాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు
సెప్టెంబర్ 1న ఋషి పంచమి.
సెప్టెంబర్ 6న, 21న సర్వ ఏకాదశి.
సెప్టెంబరు 7న వామన జయంతి.
సెప్టెంబరు 9న అనంత పద్మనాభ వ్రతం.
సెప్టెంబర్ 11న మహాలయ పక్ష ప్రారంభం.
సెప్టెంబరు 13న బృహత్యుమా వ్రతం(ఉండ్రాళ్ళ తద్దె).
సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
సెప్టెంబరు 25న మహాలయ అమావాస్య.
సెప్టెంబరు 26న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
సెప్టెంబరు 27న ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Om namo venkateshayanamaha
ReplyDelete