Actor Ali: అలీకి మరోసారి హ్యాండ్ ఇచ్చినట్టేనా..? ప్రధాన సమస్య అదేనా..?
Actor Ali: టాలీవుడ్ లో ఇద్దరు మిత్రులుగా గుర్తింపు పొందారు పవన్, అలీ.. కానీ రాజకీయాలు కారణంగా ఆ స్నేహానికి బ్రేక్ లు పడ్డాయి. ఎంతలా అంటే..? పవన్ పై పోటీకి సై అంటూ అలీ తొడలు కొట్టారు.. కానీ మరోసారి అలీకి హ్యాండ్ ఇవ్వాలని అధినేత జగన్ సిద్ధమయ్యారా..? అలీకి మైనస్ గా నిలుస్తోంది అంటే..?
Actor Ali: ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో తనదైన ముద్ర వేయాలని కమెడియల్ అలీ అరాటపడుతున్నారు. దాని కోసం ప్రెండ్ షిప్ ను కూడా పక్కన పెట్టారు. టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు పొందారు పవన్, అలీ.. మెగా అభిమానులు కూడా పవన్ అంతలానే అభిమానించేవారు.. కానీ పవన్ వైసీపీలో చేరిన తరువాత.. పవన్ తో దూరం పెరిగింది. కానీ పవన్ పై ఎప్పుడు ఆయన విమర్శించింది లేదు.. కానీ ఇటీవల మీడియా సలహాదారు పదివి అందిన తరువాత.. ఆయన వాయిస్ పెరిగింది.. ఎంతలా అంటే..? పవన్ పై పోటీ చేసుందుకు సై అంటు తొడలు కొట్టారు కూడా.. మరి నిజంగానే అలీని పోటీకి దింపే అవకాశం ఉందా..? ఉంటే ఎక్కడ నుంచి అలీ పోటీ చేస్తారు.. లేదా ఆయన అన్నట్టు పవన్ పై పోటీకి అలీని దించే ప్రయత్నం చేస్తార వైసీపీ అధినేత పవన్.. గత ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ ఇస్తుందని భావించి జగన్ గూటికి చేరారు. కానీ టిక్కెట్ లభించలేదు. దీంతో తప్పనిసరిగా పార్టీ తరుపున ప్రచారం చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ పార్టీ అధికారంలోకి వచ్చినా అలీకి మాత్రం అదృష్టం వరించలేదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ, వక్ఫబోర్డు చైర్మన్ వంటి పదవుల పేర్లు వినిపించినా.. చివరకు వందమందిలో ఒక సలహదారు పదవి దక్కించుకున్నారు. అయితే ఈ సారి పోటీకి సై అంటూ.. మనసులో మాట అధినేతకు తెలిసేలా చేస్తున్న అలీ..
వైసీపీ అధికారంలోకి వ్చచిన మూడున్నరేళ్ల తరువాత.. అలీకి పదవి అయితే దక్కింది కానీ తన మనసంతా ప్రత్యక్ష రాజకీయాల వైపే ఉంది. ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో చట్టసభల్లో అడుగుపెట్టాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. ఇటీవల చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. పార్టీ అధినేత చెవిలోపడాలని విలేకర్లు అడిగినా.. అడగకున్నా చెప్పేస్తున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ పైన అయినా పోటీకి సిద్ధమని ప్రకటిస్తున్నారు. తన సొంత ప్రాంతం రాజమండ్రి చుట్టూ ఇప్పుడు తెగ తిరుగుతున్నారు. ఎవరైనా చిన్న ఈవెంట్లకు పిలిచినా వెళుతున్నారు. చివరకు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి కూడా సై అంటున్నారు. మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటనలు ఇస్తున్నారు.
ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్ ఉన్నారు. యువకుడు, పార్టీకి విధేయుడు, పార్టీ వాయిస్ వినిపించడంలో ముందుండే భరత్ ను తప్పించే అవకాశం లేదనే చెప్పాలి. అలాగని రాజమండ్రి అర్బన్, రూరల్ లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానంటే ఇప్పటికే అక్కడ క్యాండిడేట్లు సిద్ధంగా ఉన్నారు. తమ పని తాము చేసుకుంటున్నారు. పైగా ఎంపీగా పోటీచేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు విషయంలో అలీ దూరంగా ఉంటారని అతడి వ్యవహారం తెలిసిన వారు చెబుతుంటారు.
సరే పోటీ ఎమ్మెల్యేగా పోటీచేయిద్దామంటే సామాజిక సమీకరణలతో వీలు కుదరదు.. అందుకే జగన్ అలీకి ఎటువంటి హామీ ఇవ్వనట్టు ప్రచారం జరుగుతోంది. అలీ మాత్రం అదే పనిగా ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమని ప్రకటనలిస్తున్నారు. హైకమాండ్ మాత్రం లైట్ తీసుకుంటోంది. వైసీపీలో మరో ప్రచారం కూడా ఉంది.. అలీకి గత ఎన్నికల మాదిరిగా ఎన్నికలకు దూరంగా ఉంచుతారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే మూడున్నరేళ్ల తరువాత సలహాదారు పదవి ఇచ్చారని ఎక్కువ మంది గుర్తుచేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచింది తప్ప సినిమా వాళ్ల ఆకర్షణ పనిచేయలేదని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సినిమా వారికే కాస్తా గుర్తింపు ఇవ్వగలిగారు. అందులో భాగంగా 30 ఈయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, పోసాని మురళీకృష్ణ వంటి వారికి గుర్తింపునిచ్చారని చెబుతున్నారు. ఎన్నికల ముందు పార్టీలో చేరి పదవులు ఆశించిన వారి జాబితాలో ఉన్న మోహన్ బాబును సైడ్ చేశారని.. అలీకి మొహమాటం కొద్దీ పదవి ఇవ్వక తప్పలేదని భావిస్తున్నారు. అందుకే మరోసారి అలీకి జగన్ హ్యాండ్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది..
Comments
Post a Comment