Forbes list: కోనసీమ వండర్.. ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగు యువకుడు

 Konaseema Kurrodu: మరో జాతిరత్నం తెలుగు కీర్తిని రెప రెపలాడించేలా చేస్తున్నాడు. అతడే కోనసీమ కుర్రాడు.. తాజాగా అతడి ప్రతిభకు ఫోర్బ్స్ పట్టం కట్టింది.. ఎందుకో  తెలుసా..? 


Konaseema Kurrodu: తెలుగు జాతి గర్వపడేలా చేశాడు మరో యువకుడు.. అది కూడా మన  కోనసీమకు చెందిన యువకుడే.. ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేసి.. ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న యువకుడు ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందాడు. ఇతను చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది. కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 


ఐఐటీ గౌహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్‌ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తున్నాడు.


శివతేజ మెషీన్‌ లెర్నింగ్‌ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ పరిశోధనలు చేస్తూనే నెదర్లాండ్స్‌లోని మాస్ట్రక్ట్‌ యూనివర్సిటీలో క్లినికల్‌ డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న శివతేజ ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశాడు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందారు. ఈయన చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది.


Comments

AATVNEWS

SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?

AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?

Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..