AP Elections 2024: గుంటూరులో తెలుగు దేశం అభ్యర్థులు ఫిక్స్.. 15 చోట్ల ఫైనల్ చేసిన చంద్రబాబు.. ఎవరంటే..?
AP Elections 2024: గూంటూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ సారి రాజధాని అంశం తమకు కలసి వస్తుందని భారీ ఆశలు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభ్యర్థులను చంద్రబాబు పైనల్ చేసినట్టు తెలుస్తోంది.. ఎవరికి అవకాశం ఇచ్చారంటే..?
AP Elections 2024: తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం.. పార్టీ ఉనికి కాపాడుకోవాలి అంటే గెలుపు తప్పని సరి.. అందుకే ఈ సారి చంద్రబాబు సైతం స్ట్రాటజీ మార్చి అడుగులు వేస్తోంది. అందుకే గెలుపుకు ఎక్కువ ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు.. జిల్లాలపై మొదట ఫోకస్ చేసి.. అక్కడ అభ్యర్థుల కసరత్తును పూర్తి చేస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు వ్యూహాలను పరిశీలిస్తే.. ఎన్నికల ఆఖరి వరకు ఆయన అభ్యర్థులను ఫైనల్ చేయరు.. నామినేషన్ చివరి రోజు వరకు కేండిడేట్ ను ఫైనల్ చేయరు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలి అంటే.. కచ్చితంగా దూకుడుగా వెళ్లాలి.. అందుకే ఈ సారి వ్యూహం మార్చి ముందుగానే అభ్యర్తులను ఫిక్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థులను పూర్తిగా ఫైనల్ చేసినట్టు సమాచారం. ఈ సారి గుంటూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు తెలుగు దేశం అధినేత.. గత ఎన్నికల్లోనే భారీగా ఆశలు పెట్టుకున్నా.. ఘోరంగా భంగపాటు తప్పలేదు.. మాజీ మంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. అందుకే ఈ సారి 17కు 17 నెగ్గి.. రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది.. అందులోనూ రాజధాని సెంటిమెంట్.. అమరావతి రైతుల ఉద్యమం తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తోంది. అందుకే ముందుగానే చంద్రబాబు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉండగా.. 2 నియోజకవర్గాలు మినహా 15 చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు టాక్.. అయితే అందులోనూ పొత్తుల విషయంలో క్లారిటీ వస్తే.. ఒకటి రెండు చోట్ల అభ్యర్థులు మారే అవకాశం ఉంటుంది. జనసేనతో పొత్తు ఉంటే.. రెండు చోట్ల జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మాత్రం టీడీపీ అభ్యర్థులే బరిలో ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.
.jpg)
Comments
Post a Comment