Pawan in Unstoppable 2: అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్నా.. రాజకీయాల్లోకి అందుకే వచ్చా.. పవన్ సంచలన వ్యాఖ్యలు

 Pawan in Unstoppable 2: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్  ఆత్యహత్య చేసుకోవాలి అనుకున్నారా..? ఆయన్ను ఆపింది ఎవరు..? సినిమాల్లో నెంబర్ వన్ స్టార్ గా ఎదిగిన ఆయన.. రాజకీయాలవైపు ఎందుకు అడుగులు వేశారు... టీడీపీలో చేరాలి అనుకున్నారా..? బాలయ్య ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి..?  
   

Pawan in Unstoppable 2: జనసేన అధినేత.. పవన్ స్టార్..  పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమానికి హాజరైన ఆయన.. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గతవారం తొలి ఎపిసోడ్‌ విడుదల కాగా.. ఈ వారం రెండో ఎపిసోడ్‌ రిలీజ్‌ అయింది. ఈ ఎపిసోడ్​లో పవన్​ వ్యక్తిగత, రాజకీయ విశేషాల గురించి చాలామందికి తెలియన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే..? రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా నమ్మకం సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందన్నారు. రాజకీయ ఎంట్రీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.  నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్‌ సమస్య తీవ్రంగా ఉండేదని.. అయితే అక్కడ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలని ప్రయత్నంలో భాగంగా కొద్దిమందిని అక్కడికి పంపిస్తే స్థానిక రాజకీయ గ్రూప్స్‌ అడ్డుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా? అనిపించింది. ఎన్జీవో ప్రారంభించాలనుకున్నా. తర్వాత నా ఆలోచనా పరిధికి ఎన్జీవో సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలనుకున్నా. అలా రాజకీయ పార్టీ పెట్టాను అన్నారు.

తాను.. ఓ ఆలోచనతో ఉన్నా.. అదే సమయంలో.. ఓసారి కలవాలంటూ నరేంద్ర మోదీ నుంచి తనకు కబురు వచ్చిందన్నారు. మార్చిలో పార్టీ పెట్టాం. ఎన్నికలు ఏప్రిల్‌ మధ్యలో వచ్చాయి. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉండే స్టార్‌డమ్‌ పాలిటిక్స్‌లో కూడా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారని.. అయితే ఎన్‌. టి. రామారావు, ఎంజీఆర్‌ గారి విషయంలో అది జరిగింది. అందరికీ అలానే అవుతుందని చెప్పలేం అన్నారు.  ఆ స్పష్టత తనకు ఉందన్నారు. రాం మనోహర్‌ లోహియా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు  పాలిటిక్స్‌ నేర్చుకోవాలనుంది అన్నారు. 

పాలిటిక్స్‌లో విమర్శను కచ్చితంగా స్వీకరించాలి. ఏ విమర్శనైనా భరించాలనే దాన్నీ అన్నయ్య చిరంజీవి నుంచే నేర్చుకున్నాను అన్నారు. సద్విమర్శల కారణంగా మనలోని లోపాలేంటో తెలుసుకుని, సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్నయ్య నుంచి తీసుకోనిది ఏదైనా ఉందంటే అది మొహమాటం అన్నారు. అలాగే అభిమానం వేరు.. అది ఓటుగా మారడం వేరని అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో ఎవరైనా ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకుని, ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దాని వెనుక దశాబ్దాల కృషి ఉంటుంది. సినీ పరిశ్రమలో పేరున్న వ్యక్తి రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంతటి నమ్మకం పొందాలంటే సమయం పడుతుందన్నారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్నారు. 

విశాఖపట్నంలో జరిగిన ఘటన గురించి కూడా స్పందించారు. తాను ఓ అడుగు వేసినా, మాట్లాలనుకున్నా ప్రభుత్వంలో ఉండేవారందరికీ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తాను మామూలుగా చూసినా దానికీ ఓ అర్థం తీస్తారని అభిప్రాయపడ్డారు. తాను వైజాగ్‌ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు పన్నారని. కానీ, తాను వాళ్లతో పోటీ పెట్టుకోలేదు. వారి ఆలోచన ఏంటో తెలియదుగాని లైట్‌ ఆపేయడంలాంటివి చేశారన్నారు. అవన్నీ సహజమేగానీ అధికార యంత్రాంగం కూడా హద్దులు దాటి అమాయికులు, ఓ మహిళపై హత్యాయత్నం కేసులు పెట్టడం బాధించింది అన్నారు. ఆధిపత్య ధోరణి అది. ఎవరూ నోరెత్తకూడదంటే ఎలా? తాను నోరెత్తుతా.. అది ప్రజలకు చేరుతుందన్న ఇబ్బంది వారికి ఉందనుకుంటా. అయితే, తాను దాన్ని రాజకీయంలో భాగంగానే చూస్తాను అన్నారు. 

కేవలం జనసేన సభకు స్థలమిచ్చారనే.. ఇళ్లు కూల్చడం దారుణం కాదా అని ప్రశ్నించారు.  జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న కారణంగానే గుంటూరు జిల్లాలో ఇప్పటం గ్రామరైతుల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయించిందని గుర్తు చేశారు. అప్పటికే వారికి ఇచ్చిన నోటీసులను ఇదే అవకాశంగా వాడుకుందన్నారు. తాను వారిని పలకరించడానికి ఇప్పటం వెళ్దామనుకున్నా కానీ పోలీసులు కదలనివ్వలేదు. అనుమతి లేదన్నారు. అంతకుముందు విశాఖలోనూ ఇబ్బంది పెట్టారు. కారులో ప్రజలకు కనబడకూడదు, చేతులు ఉపకూడదన్నారు. లైట్లు తీసేశారు. హోటల్‌ గదిలో నిర్బంధించారు. బయటకు రాకూడదన్నారు' అక్కడితోనే ఆగలేదు. ఇప్పటం గ్రామం వెళ్లేటపుడూ అలానే వ్యవహరించారని.. తాను అక్కడికి వెళ్లకూడదు. వెళ్తే గొడవ చేస్తారు అంటూ పోలీసు అధికారులు తనను ఆపారు.  బాధితులను పరామర్శించడం తన ప్రాథమిక హక్కు అన్నారు. కానీ రోడ్డుపై నడవకూడదు, కారులోంచి బయటకు రాకూడదు, రూమ్‌లో ఉండకూడదు, రూమ్‌లోంచి బయటకు రాకూడదు.. అని అంటుంటే చాలాకాలం తర్వాత కొంచెం తిక్క వచ్చిందన్నారు. అందుకే ఎవరు ఆపుతారో చూద్దాం అంటూ కారుపైకి ఎక్కి కూర్చొన్నా అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను నడుస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. తాను వెళ్తా అన్న ధోరణిలో అక్కడికి వెళ్లాను అన్నారు. అది కూడా నిరసనలో ఓ భాగమన్నారు.  

ఇక టీడీపీలో ఎందుకు చేరలేదని బాలయ్య ప్రశ్నిస్తే... తాను కాంగ్రెస్‌లోనూ చేరలేదు. అప్పటికే ఉన్న పార్టీలకు సిద్ధాంతాలు, లక్ష్యాలు ఉన్నాయి. అధికారం రాని చాలా సమూహాలకు సాధికారతనిచ్చే దిశగా వెళ్లాలంటే ఉన్న పార్టీలతో ఎంతవరకు సాధించగలనన్న సందేహం. కొన్ని మూలసిద్ధాంతాలు పెట్టుకున్నా అన్నారు. తనకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే  రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా" అని పవన్ స్సష్టం చేశారు.  ప్రజాస్వామ్యమంటేనే నోరు ఎత్తడం. నా సినిమా వంద మందిలో 40 మందికి నచ్చకపోవచ్చు. వారు తిడతారు. భరించాలి. నచ్చని గొంతు వినాలి. అసలు నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తితే ప్రజలకు చేరుతుందనే ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇదో నిరంకుశ విధానం. రాజకీయ ప్రయాణంలో ఇదో భాగం మాత్రమే అన్నారు.  బాలకృష్ణది ముక్కుసూటి వ్యక్తిత్వం అని కల్మషం లేని ఆలోచనా విధానం అని. మంచోచెడో మాటలు గుండెల్లోంచి వస్తాయని.. అయితే  ఈ షోకు రాకముందు ఎలాంటి భావన ఉందో కలిశాకా అదే భావన ఉందన్నారు. ఈ వేదికకు సరితూగే వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడారు. ఆయన రాజకీయాల్లో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నా అన్నారు పవ. బాలకృష్ణ స్పందిస్తూ ‘తట్టుకోలేనంత బాధ వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు స్నేహితులు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో మనసువిప్పి మాట్లాడండి. సిగ్గుపడొద్దు. ఎవరేమనుకుంటారోనని భయపడకండి. దారినపోయే దానయ్య సలహా కూడా జీవితాన్ని మార్చేయొచ్చు. ఈ జన్మ ఒక వరం. జీవించడం ఒక యోగం. సాధనతో మీలో నుంచి ఒక పవర్‌స్టార్‌ పుట్టొచ్చు’ అని పేర్కొన్నారు.

ఇక అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్న విషయాన్ని పవన్ పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం ఉండేవి. ఆరు, ఏడో తరగతుల్లో ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. సరైన స్నేహితుల్లేక ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చేది. పుస్తకాలే స్నేహితులుగా గడిపాను. పాఠశాల, కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా అన్పించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో ఉపాధ్యాయులూ నచ్చేవాళ్లు కాదు. సెల్ఫ్‌ లెర్నింగ్‌లో నడిచాను. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్‌లో రాణిస్తున్న వేళ నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. ఆత్మన్యూనతాభావం ఉండేది. 17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయా. చనిపోతే బాగుండు అన్పించింది. అన్నయ్య లైసెన్స్‌ రివాల్వర్‌ తీసుకుని కాల్చుకుందామనుకున్నా. సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. కాల్చుకుందామనుకుంటున్నా అని చెప్పడంతో వారు చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షలపై దిగులుతో ఇలా ప్రవర్తిస్తున్నానని చెప్పారు. నువ్వేం చదవకపోయినా పర్లేదు, బతికి ఉండరా అని చెప్పారని నాటి సంఘటనను పవన్ గుర్తు చేసుకున్నారు.


Comments

AATVNEWS

SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?

AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?

Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..