SSLV-D2 Success: ఇస్రో సూపర్ సక్సెస్.. సరికొత్త రికార్డ్.. విజయవంతమైన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగం.. ప్రయోజనాలేంటంటే..?
SSLV-D 2 Success: ఇస్రో సూపర్ సక్సెస్ అయ్యింది.. సరికొత్త రికా సాధించింది. తాజాగా ఎస్ఎస్ఎల్వీడీ 2 ప్రయోగాన్ని విజయవంతం చేసింది.. మూడు ఉప గ్రహాలను కక్ష్యలోకి పంపింది.. అయితే వీటి ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
SSLV-D 2 Success: భారత అంతరిక్ష కేంద్రం.. మరో సూపర్ సక్సెస్ అందుకుంది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ మరో అడుగు ముందుకేసి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు రూపొందించిన ఉపగ్రహంతో పాటు మరో రెండు ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశపెట్టటంతో ప్రయోగం పూరైంది. సతీశ్‌ధావన్ స్పేస్‌సెంటర్ నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. దీని ఏర్పాట్లను ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ పర్యవేక్షించారు.
కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం తెల్లవారు జాము 2.48 గంటలకే ప్రారంభమైంది. ఇక ఉదయం 6.30 గంటల వరకు ఈ కౌంటర్ డౌన్ సాగింది. ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరింది. నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2.. భారత్‌కు చెందిన 2 ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 1 ఉపగ్రహన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో ఈ ప్రయోగం పూర్తైంది.
ఎలాంటి అవంతారాలు లేకుండా చూసుకునేందుకు.. గురువారమే రిహార్సల్స్ నిర్వహించారు శాస్త్రవేత్తలు.. రాకెట్ పనితీరు బాగుందని నిర్ధారించుకున్నారు. తరువాత షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. సాయంత్రం భాస్కర కాన్ఫరెన్సు హాలులో లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశం నిర్వహించిన తరువాత ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని ఓకే అనుకున్న తరువాత.. కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన మూడు ఉపగ్రహలలో.. ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు ఉండే ఈవోఎస్-07 ఉపగ్రహం. దీంతో పాటు అమెరికలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1 ఉపగ్రహం. చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ఉపగ్రహలు ఉన్నాయి. ఈ ప్రయోగం 13 నిమిషాల 2 సెకండ్లలో పూర్తై.. 450 కిలోమీటర్ల ఎత్తులో ఈవోఎస్-07, జానుస్-1, చివరగా ఆజాదీశాట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Comments
Post a Comment