Vidadala Rajani: అధినేత దృష్టిలో పడేందుకే సరికొత్త ఫీట్లు.. అధిష్టానానికి మహిళా మంత్రిపై ఫిర్యాదులు
Vidadala Rajani: మంత్రి విడుదల రజని తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నిత్యం అధినేత ఫోకస్ తనపై పడేలా చూసుకుంటూ హడావుడి చేసే ఆమెకు.. అదే మైనస్ అయ్యిందా.. మంత్రిపై స్థానిక నేతల ఫిర్యాదుకు కారణం ఏంటి..?
Vidadala Rajani: ఏపీ రాజకీయాల్లో విడుదల రజని సంచలనంగానే చెప్పొచ్చు.. వైసీపీలో చేరిన అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి వీర విధేయులు.. సీనియర్ నేతలను పక్కకు నెట్టి.. తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ తెచ్చుకోగలిగారు. ఆ మధ్య కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసినప్పుడూ ఆమె గెలుపు అనూహ్యమే. టీడీపీలో ఉన్నప్పుడు అధినేత మెప్పుకోసం వీరభక్తిని చూపించిన రజనీ.. కట్ చేస్తే వైసీపీలో మాట మడతేశారు. నాడు పొగిడిన టీడీపీ అధినేతనే తెగిడారు. పూర్తి అపరిచితురాలిలాగా మారారంటూ సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు మంత్రిగా విడుదల రజని ప్రవర్తన మరోసారి అధికారపార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. ఎంతలా అంటే..? ఆమె సొంత పార్టీ నేతలే అధినేత జగన్ కు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
తాజాగా గడప గడపకు కార్యక్రమాన్ని రజని ఫార్సుగా మార్చేశారట. ఎక్కడ ఉన్నా అధినేత నాడి పట్టేశారనే చెప్పాలి. ముఖ్యంగా అధినేతతో పాటు పలు వేదికల్లో కనిపించడానికి.. అధినేత తెప్పించుకునే నివేధికల్లో తన ట్రాక్ రికార్డు బాగుండేలా..? ప్లాన్స్ చేసుకోవడం ఆమెకు అలవాటే.. ప్రస్తుతం మంత్రులు.. ఎమ్మెల్యే లు అంతా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. కానీ మంత్రి విడుదల రజనీ మాత్రం.. గడప గడపకు ప్రభుత్వం అర్థాన్ని మార్చేశారు.
గడప గడపకు ప్రభుత్వం పేరుతో.. రెండిళ్ల దగ్గరకు వెళ్లడం.. అక్కడో అరడజను ఫొటోలు దిగడం.. హాయ్ బాయ్ అనడం. సర్దేయడం. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫీల్డ్‌లో ఎలా పనిచేస్తున్నారో అధిష్ఠానం వివిధ మార్గాల్లో రిపోర్ట్స్ తెప్పించుకుంటోంది. గ్రాఫ్ సరిగా లేని.. గడప దాటని నేతలకు అక్షింతలు వేస్తున్నారు అధినేత. దీనికోసమే మంత్రి ఇలా ప్లాన్ చేశారట. ఎమ్మెల్యే కావడానికి ముందు.. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కావడానికి కూడా మేడమ్ ఇలాంటి స్ట్రాటజీలే ఫాలో అయ్యారని అనుచరులు చెబుతున్నారు.
కేవలం అధినేత దృష్టిలో పడేందుకు పెద్ద సోషల్ టీమ్ ఏర్పాటు చేసుకుని ప్రతికదలికను ఫ్రేమ్‌లో బంధిస్తారు మంత్రి.. అలా వాటిని జాతీయ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల్లో పెట్టి క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటున్నారు. గతంలో వర్కౌట్ అయిన ఆ సోషల్ వ్యూహాలు.. ఇప్పుడు మంత్రికి బెడిసి కొడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి రజని తీరుపై వైసీపీ అధిష్ఠానానికి అనేక ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. మంత్రిగా ఆమె పనితీరుపై హైకమాండ్ సైతం సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. మహిళా, బీసీ నేతగా పార్టీలో వేగంగా గుర్తింపు తెచ్చుకున్నా.. అదంతా మంత్రి అయ్యాక ఆమె పనితీరుతో నీటి బుడగలా తేలిపోయాయని వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Post a Comment