Posts

Showing posts from August, 2022

Ganesh Chaturthi 2022: చంద్రుడు ప్రతిష్టించిన గణేషుడు గురించి విన్నారు.. మనసారా కోరుకుంటే మీ సమస్యలు తీరినట్టే..

Image
Ganesh Chaturthi 2022: వినాయక చవితి అంటే అందరికీ గుర్తు వచ్చేది చంద్రుడి కథే.. మరి చవితి పర్వదినం పురస్కరించుకుని సాక్షాత్తు ఆ చంద్రుడే ప్రతిష్టించిన గణపయ్య గురించి మీకు తెలుసా..? అంతేకాదు బెల్లం గణేషుడిగా గుర్తింపు పొందిన ఈ స్వామిని ఏదైనా కోరుకుంటే.. వెంటనే ఆ కోరిక తీరుతుంది అంట..                  Bellam Ganapathi:  రేపే వినయాక చతుర్ధి..  (Ganesh Chathurthi)  దేశ వ్యాప్తంగా వినయక ఆలయాల్లో ప్రత్యేక పూజలతో నవరాత్రులూ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే విఘ్నాలు తొలగించే వినాయకుడు.. నైవేజ్యం పేరుతో భక్తులు పత్రం, ఫలం ఏది ఇచ్చినా ఒదిగిపోయే గణపయ్య ఎన్నో రూపాల్లో పూజులు అందుకుంటున్నాడు.   వినాయక  చవితి అంటే అందరికీ గుర్తు వచ్చేది చంద్రుడి కథే.. మరి చవితి పర్వదినం పురస్కరించుకుని సాక్షాత్తు ఆ చంద్రుడే ప్రతిష్టించిన గణపయ్య గురించి మీకు తెలుసా..? సాక్ష్యాత్తు చంద్రుడే వచ్చి బెల్లం వినాయకుడిని ప్రతిష్టించినట్టు పురాణాలు, పూర్వికుల మాట. అయితే బెల్లం వినాయకుడి (Jaggery Ganapathi)గా పూజలందుకుంటున్న ఈ గణపయ్య విశాఖపట్నంలో కొలువ...

Astro Tips: కొబ్బరికాయతో అదృష్టం మార్చుకోవచ్చా? ఇలా చేయండి!

Image
 Astro Tips: జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారా? ముఖ్యంగా ఆర్థిక లేక.. కుటుంబపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా..? అయితే ఆ సమస్యలకు కొబ్బరి కాయలతోనే మీ అదృష్టం మార్చుకోవచ్చని తెలుసా..? మరోవైపు ప్రస్తుతం ఏపీలో భారీగా కొబ్బరికాయల రేట్లు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారో ఎందుకో తెలుసా..?  Astro tips for Coconut: సాధారణంగా ఏ పూజ చేసిన, శుభకార్యం మెుదలుపెట్టినా కచ్చితంగా ఉండాల్సిన వాటిలో కొబ్బరి కాయ ఒకటి. కొబ్బరికి హిందువులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే ప్రతి దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో కొబ్బరి ఒకటి.. అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి..  జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చని మీకు తెలుసా? సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని శ్రీఫలం అని కూడా అంటారు. టెంకాయ లేదా కొబ్బరికాయ (Coconut) కొట్టకుండా ఈ పూజ, శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,  ఎవరి జాతకంలోనైనా గ్రహా దోషాలు, అడ్డంకులను తొలగించడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెబుతారు.. అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయ తప్పని సరిగా పెడతారు. ఏ దేవు...

Tirumala: భక్తులకు అలర్ట్.. తిరుమలలో సెప్టెంబర్ లో విశేష పర్వదినాలు ఎన్నో..? బ్రహ్మోత్సవాలు ఎ్పపటి నుంచి అంటే..?

Image
 Tirumala:కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మరోవైపు రాబోయే సెప్టెంబర్ నెలలో చాలా పర్వదినాలు ఉన్నాయి.. ఆ పర్వదినాలు ఏంటి.. ఎలాంటి సేవలు నిర్వహిస్తారో తెలుసుకుందాం..  Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ శ్రీనివాసుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల (TirumalaTemple). శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే (Tirumala Sri Vari Darshan) అంతా మంచేజరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే నిత్యం తిరుమల గిరిలు రద్దీగా ఉంటాయి.  ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారిని దర్శించుకోవడానికి విపరీతమైన పోటీ ఉంటుంది. అందుకే బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది.. కరోనా కారణంగా గత రెండేళ్లూ ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలను పూర్తి చేయాల్సి వచ్చింది.  అందుకే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanam). ఇప్పటికే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నుండి ...

Toddy Fruit Recipe: వరుసగా 40 రోజులు తాడిపండ్లు తింటే ఏం జరుగుతుంది? ఆ వంటకాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Image
 Toddy Fruit Recipe: తాటిముంజుల గురించి అందరికీ తెలిసిందే..? వీటి గురించి దాదాపు అందరికీ తెలుసు.. కానీ తాటి పండ్లు.. వాటితో చేసుకునే వంటకాల గురించి విన్నారు.. కేవలం రుచిగా ఉండడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..? తెలిస్తే షాక్ అవుతారు..? Toddy Fruit Recipe: నేటి జనరేషన్ కు పెద్దగా తాటి సంపద గురించి పెద్దగా తెలియదు.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే యువతకు సైతం పెద్దగా ఈ తాటి సంపద గురించి తెలియదు.. కేవలం తాటి ముంజులు గురించి మాత్రమే అందరికి తెలుస్తుంది. ఎందుకంటే వేసవి కాలం వచ్చిందంటే.. నగరాల్లో సైతం వీధి వీధిలో తాటి ముంజుల అమ్మకాలు సాగుతాయి. చాలామంది ఇష్టంతో తింటారు కూడా.. అయితే తాటి సంపద అంటే కేవలం ముంజులు మాత్రమే కాదు.. తాటిపండ్లు, తేగలు, కళ్లు ఇలాచాలానే ఉన్నాయి. అయితే వీటితో ప్రయోజనాలుకూడా చాలానే ఉన్నాయి. మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ తాటిపండుతో కడుపునింపుకునే వారు. కొందరు వేడి చేసుకుని మరికొందరు ఈ పండును అలానే తినేవారు. కానీ చేతికి, మూతికి అంటుకుంటోందని క్రమేపీ దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు నేరుగా ఆ పండ్లను తినేవారి సంఖ్య తగ్గింది అనే చెప్పాలి. కేవలం గ్రామాల్లో మాత్రం అది ...

SEA MAFIA: సముద్రాన్ని కూడా వదలరా..? భయపెడుతున్న కొత్త మాఫియా?

Image
 మట్టిని.. రాళ్లను, నదీ ఇసుకను దేన్నీ వదలడం లేదు మాఫియా రాయుళ్లు.. ఇప్పుడు సముద్రు ఇసుకను సైతం వదలడం లేదు.. ఎందుకో తెలుసా?   Black Sand Mafia:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మాపియా  రాయుళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు.  ఇప్పటికే అక్రమార్కులు వాగులు, కాలువలు, నదులను కొల్లగొడుతున్నారు. ఇసుక, మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.  చివరికు సముద్రాన్ని కూడా వదలడం లేదు. సముద్రం ఒడ్డున (Beach Sand) దొరికే.. నల్ల ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. అది కూడా అందరూ చూసినప్పుడైతే కుదరదని.. రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సముద్రపు ఇసుకతో ఏం లాభం అనుకుంటున్నారా..? సముద్రపు నల్ల ఇసుకకు చాలా డిమాండ్‌ (Full Demand for Black Sand) ఉంటుంది. భోగాపురం (Bhogapuram) మండలంలోని ముక్కాం గ్రామానికి కిలోమీటరు దూరాన సముద్ర తీరం ఉంది. అది కూడా ఈ నల్ల ఇసుక ఆరు అంగుళాల ఎత్తులో సమృద్ధిగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల కన్ను ఇక్కడి ఇసుకపై పడింది. కొందరు స్థానికుల స...