TTD: సర్వభూపాల వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి.. శేష వాహనంపై కపిలేశ్వరుడు.. వైభవంగా బ్రహ్మోత్సవాలు
.jpg)
TTD: కలియుగ వైకుంఠంగా భావించే సప్తగిరులలో నిత్యం సేవలు జరుగుతూనే ఉంటాయి.. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూ భక్తులకు తన్మయత్వం కలిగిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి.. మంగళవారం సైతం జరిగిన వాహన సేవలు.. వైభవంగా సాగాయి. TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి నిత్యం ఏదో ఒక రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు బకాసురవధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాల వాహన సేవకు చాలా ప్రత్యేకత ఉంది. సర్వభూపాల అంటే ర...