Posts

Showing posts from February, 2023

TTD: స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి.. శేష వాహనంపై కపిలేశ్వరుడు.. వైభవంగా బ్రహ్మోత్సవాలు

Image
 TTD: కలియుగ వైకుంఠంగా భావించే సప్తగిరులలో నిత్యం సేవలు జరుగుతూనే ఉంటాయి.. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తూ భక్తులకు తన్మయత్వం కలిగిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి.. మంగళవారం సైతం జరిగిన వాహన సేవలు.. వైభవంగా సాగాయి.   TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి నిత్యం ఏదో ఒక రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం  శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బ‌కాసుర‌వ‌ధ‌ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాల వాహన సేవకు చాలా ప్రత్యేకత ఉంది. సర్వభూపాల అంటే ర...

AP Capital: ఏపీకి మూడు రాజధానులు అబద్ధం.. ఒక్కటే అని స్పష్టత ఇచ్చిన బుగ్గన.. ఇంతకీ రాజధాని ఏంటంటే?

Image
 AP Capital: ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు లేవా..? ఇంతకాలం ముఖ్యమంత్రి.. మంత్రులు చెబుతున్నది అంతా అసత్యమేనా..? ఈ మాట ఎవరో అంటే విపక్షాల విమర్శలు అనుకోవచ్చు.. కానీ ఏపీ మంత్రి బుగ్గనే స్వయంగా దీనిపై స్పష్టత ఇచ్చారు.. మూడు రాజధానులు అన్నమాట అవాస్తవం అన్నారు.  AP Capital: అధికార వికేంద్రీకరనే తమ ధ్యేయం.. మూడు రాజధానులు నిర్మించి తీరుతాం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న మాట ఇదే.. అసంబ్లీ వేదికగా కూడా సీఎం జగన్ ఇదే మాట చెప్పారు కూడా.. ఇటు ముఖ్యమంత్రి.. అటు మంత్రులు.. నేతలు అంతా పదే పదే ఇదే మాట చెబుతున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని ప్రకటనలు చేశారు. అయితే ఇదంతా ఉట్టి ప్రకటనలేనా..? అసలు మూడు రాజధానుల ఊసే లేదా..? ఏది వాస్తవం..  ఇలా ప్రశ్నించేది విపక్షాలు అయితే.. రాజకీయ విమర్శలు అని కొట్టి పారేయొచ్చు.. కానీ ఈ మాట చెప్పింది స్వయంగా ఏపీ మంత్రి బుగ్గన.. గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్​ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ రాజధాని అంశంపై మంత్రులను పెట్టుబడిదారులు పలు రకాల ప్రశ్నలు అడిగారు. విశాఖ పైనే ఎందుకు దృష్ట...

SSLV-D2 Success: ఇస్రో సూపర్ సక్సెస్.. సరికొత్త రికార్డ్.. విజయవంతమైన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగం.. ప్రయోజనాలేంటంటే..?

Image
 SSLV-D 2 Success: ఇస్రో సూపర్ సక్సెస్ అయ్యింది.. సరికొత్త రికా సాధించింది. తాజాగా ఎస్ఎస్ఎల్వీడీ 2 ప్రయోగాన్ని విజయవంతం చేసింది.. మూడు ఉప గ్రహాలను కక్ష్యలోకి పంపింది.. అయితే వీటి ప్రయోజనాలు ఏంటో తెలుసా..?   SSLV-D 2 Success: భారత అంతరిక్ష కేంద్రం.. మరో సూపర్ సక్సెస్ అందుకుంది. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మరో అడుగు ముందుకేసి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. చెన్నై స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు రూపొందించిన ఉపగ్రహంతో పాటు మరో రెండు ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశపెట్టటంతో ప్రయోగం పూరైంది. సతీశ్‌ధావన్‌ స్పేస్‌సెంటర్‌ నుంచి చేపట్టనున్న చిన్న ఉపగ్రహ వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. దీని ఏర్పాట్లను ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ పర్యవేక్షించారు.  కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం తెల్లవారు జాము 2.48 గంటలకే ప్రారంభమైంది. ఇక ఉదయం 6.30 గంటల వరకు ఈ కౌంటర్ డౌన్ సాగింది. ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2) నింగిలోకి బయలుదేరింది. నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2.. భారత్‌కు చెందిన 2 ఉపగ్...

Pawan in Unstoppable 2: అన్నయ్య తుపాకీతో కాల్చుకుందామనుకున్నా.. రాజకీయాల్లోకి అందుకే వచ్చా.. పవన్ సంచలన వ్యాఖ్యలు

Image
 Pawan in Unstoppable 2: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్  ఆత్యహత్య చేసుకోవాలి అనుకున్నారా..? ఆయన్ను ఆపింది ఎవరు..? సినిమాల్లో నెంబర్ వన్ స్టార్ గా ఎదిగిన ఆయన.. రాజకీయాలవైపు ఎందుకు అడుగులు వేశారు... టీడీపీలో చేరాలి అనుకున్నారా..? బాలయ్య ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి..?       Pawan in Unstoppable 2: జనసేన అధినేత.. పవన్ స్టార్..  పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘అన్‌స్టాపబుల్‌ 2’ కార్యక్రమానికి హాజరైన ఆయన.. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గతవారం తొలి ఎపిసోడ్‌ విడుదల కాగా.. ఈ వారం రెండో ఎపిసోడ్‌ రిలీజ్‌ అయింది. ఈ ఎపిసోడ్​లో పవన్​ వ్యక్తిగత, రాజకీయ విశేషాల గురించి చాలామందికి తెలియన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన ఏమన్నారంటే..? రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని, ఏ రంగంలోనైనా నమ్మకం సంపాదించాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతుందన్నారు. రాజకీయ ఎంట్రీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.  నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్‌ సమస్య తీవ్రంగా ఉండేదని.. అయితే అక్కడ ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అంద...

TTD: అప్పుడలా..? ఇప్పుడిలా..? తిరుమల తిరుపతి దేవస్థానంపై రమణ దీక్షితులు తిరుగుబాటుకు కారణం అదేనా..?

Image
 TTD: గతంలో తెలుగు దేశం ప్రభుత్వంపైనా..? తిరుమల తిరుపతి దేవస్థానంపైనా.. ఓ రేంజ్ విరుచుకుపడ్డారు రమణ దీక్షితులు.. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ కు దగ్గర అయ్యారు. అయితే వైసీపీ అధికారంలోకి ఆయనకు టీటీడీలో తిరుగుండదు అనుకున్నారు..? ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది..? టీటీడీపై తిరుబాటు చేస్తున్నారు.. ఆయన తిరుగుబాటుకు కారణం ఏంటి..? TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల.. శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు రమణ దీక్షితులు మాటే శాసనం.. ఆయన ఒకే చెబితేనే శ్రీవారి ఆలయంలో మార్పులు చేసే వారు.. కాలం మారే కొద్దీ పాలకుల్లో మార్పులు వచ్చాయి.. వంశ పార్యంపర్య అర్చకులకు... అర్హతకు తగట్లు అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు.. దీంతో పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై, ప్రత్యక్షంగా ఆలయ అధికారులపై విమర్శలు చేస్తూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు తాజా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.. తిరుమల గురించి తెలిసిన వారికి పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి ఆయన.. ఎందుకంటే ఒక్కపుడు శ్రీవారి దర్శనం తరువాత రమణ దీక్షితులు ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భావించే వారు భక్తుల...

Vidadala Rajani: అధినేత దృష్టిలో పడేందుకే సరికొత్త ఫీట్లు.. అధిష్టానానికి మహిళా మంత్రిపై ఫిర్యాదులు

Image
 Vidadala Rajani: మంత్రి విడుదల రజని తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నిత్యం అధినేత ఫోకస్ తనపై పడేలా చూసుకుంటూ హడావుడి చేసే ఆమెకు.. అదే మైనస్ అయ్యిందా.. మంత్రిపై స్థానిక నేతల ఫిర్యాదుకు కారణం ఏంటి..? Vidadala Rajani: ఏపీ రాజకీయాల్లో విడుదల రజని సంచలనంగానే చెప్పొచ్చు.. వైసీపీలో చేరిన అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి వీర విధేయులు.. సీనియర్ నేతలను పక్కకు నెట్టి.. తనకంటూ ఓ క్రేజ్ క్రియేట్ తెచ్చుకోగలిగారు. ఆ మధ్య కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్‌ చేసినప్పుడూ ఆమె గెలుపు అనూహ్యమే. టీడీపీలో ఉన్నప్పుడు అధినేత మెప్పుకోసం వీరభక్తిని చూపించిన రజనీ.. కట్‌ చేస్తే వైసీపీలో మాట మడతేశారు. నాడు పొగిడిన టీడీపీ అధినేతనే తెగిడారు. పూర్తి అపరిచితురాలిలాగా మారారంటూ సోషల్ మీడియాలో చాలా ట్రోల్‌ అయ్యాయి. ఇప్పుడు మంత్రిగా విడుదల రజని ప్రవర్తన మరోసారి అధికారపార్టీలో  హాట్ టాపిక్ అవుతోంది. ఎంతలా అంటే..? ఆమె సొంత పార్టీ నేతలే అధి...

Actor Ali: అలీకి మరోసారి హ్యాండ్ ఇచ్చినట్టేనా..? ప్రధాన సమస్య అదేనా..?

Image
 Actor Ali: టాలీవుడ్ లో ఇద్దరు  మిత్రులుగా గుర్తింపు పొందారు పవన్, అలీ.. కానీ రాజకీయాలు కారణంగా ఆ స్నేహానికి బ్రేక్ లు పడ్డాయి. ఎంతలా అంటే..? పవన్ పై పోటీకి సై అంటూ అలీ తొడలు కొట్టారు.. కానీ మరోసారి అలీకి హ్యాండ్ ఇవ్వాలని అధినేత జగన్ సిద్ధమయ్యారా..? అలీకి మైనస్ గా నిలుస్తోంది అంటే..?   Actor Ali: ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో తనదైన ముద్ర వేయాలని కమెడియల్ అలీ అరాటపడుతున్నారు. దాని కోసం ప్రెండ్ షిప్ ను కూడా పక్కన పెట్టారు. టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా గుర్తింపు పొందారు పవన్, అలీ.. మెగా అభిమానులు కూడా పవన్ అంతలానే అభిమానించేవారు.. కానీ పవన్ వైసీపీలో చేరిన తరువాత.. పవన్ తో దూరం పెరిగింది. కానీ పవన్ పై ఎప్పుడు ఆయన విమర్శించింది లేదు.. కానీ ఇటీవల మీడియా సలహాదారు పదివి అందిన తరువాత.. ఆయన వాయిస్ పెరిగింది.. ఎంతలా అంటే..? పవన్ పై పోటీ చేసుందుకు సై అంటు తొడలు కొట్టారు కూడా.. మరి నిజంగానే అలీని పోటీకి దింపే అవకాశం ఉందా..? ఉంటే ఎక్కడ నుంచి అలీ పోటీ చేస్తారు.. లేదా ఆయన అన్నట్టు పవన్ పై పోటీకి అలీని దించే ప్రయత్నం చేస్తార వైసీపీ అధినేత పవన్.. గత ఎన్నికలకు ముందు వైసీపీ టిక్కెట్ ఇస్తుం...

AP Elections 2024: గుంటూరులో తెలుగు దేశం అభ్యర్థులు ఫిక్స్.. 15 చోట్ల ఫైనల్ చేసిన చంద్రబాబు.. ఎవరంటే..?

Image
 AP Elections 2024: గూంటూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ సారి రాజధాని అంశం తమకు కలసి వస్తుందని భారీ ఆశలు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభ్యర్థులను చంద్రబాబు పైనల్ చేసినట్టు తెలుస్తోంది.. ఎవరికి అవకాశం ఇచ్చారంటే..? AP Elections 2024: తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికలు ఎంతో కీలకం.. పార్టీ ఉనికి కాపాడుకోవాలి అంటే గెలుపు తప్పని సరి.. అందుకే ఈ సారి చంద్రబాబు సైతం స్ట్రాటజీ మార్చి అడుగులు వేస్తోంది. అందుకే గెలుపుకు ఎక్కువ ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు.. జిల్లాలపై మొదట ఫోకస్ చేసి.. అక్కడ అభ్యర్థుల కసరత్తును పూర్తి చేస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు వ్యూహాలను పరిశీలిస్తే.. ఎన్నికల ఆఖరి వరకు ఆయన అభ్యర్థులను ఫైనల్ చేయరు.. నామినేషన్ చివరి రోజు వరకు కేండిడేట్ ను ఫైనల్ చేయరు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలి అంటే.. కచ్చితంగా దూకుడుగా వెళ్లాలి.. అందుకే ఈ సారి వ్యూహం మార్చి ముందుగానే అభ్యర్తులను ఫిక్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూ...

AP Capital Shifting: విశాఖ నుంచే ఇక సీఎం జగన్ పాలన.. ముహూర్తం ఫిక్స్.. క్యాంప్ ఆఫీస్ ఎక్కడంటే?

Image
 AP Capital Shifting: విపక్షాలు వద్దంటున్నాయి.. కోర్టులో అభ్యంతరాలు ఉన్నాయా..? న్యాయపరంగా తీర్పు రావాల్సి ఉంది.. అయినా.. విశాఖ నుంచి పాలించేందుకు జగన్ సిద్ధమయ్యారు.. ఎక్కడ నుంచి పాలన సాగించాలి.. రాజధానిని పూర్తిగా ఎప్పటికి సిఫ్ట్ చేయాలి అన్నదానికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు టాక్.. AP Capital Shifting: ఏపీ రాజధాని విశాఖే.. సీఎం జగన్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు.. విపక్షాల వాదన ఎలా ఉన్నా..? కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నా.. ఆయన మాత్రం విశాఖ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో కామెంట్లు చేసిన తరువాత.. విశాఖలో హంగామా వేగంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో.. అది కూడా అతి త్వరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతుంది అనే సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై అధికార యంత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ మౌఖికంగా మాత్రం ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అన్వేషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న...

Amaravati: అమరావతి రాజధాని వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు... ఈ నెల 23న భవిష్యత్తు తేలేనా..?

Image
 Amaravati: ఏపీ రాజధాని ఏదీ.. ఈ ప్రశ్నకు సమాధానం సుప్రీం కోర్టు ద్వారానే తేలాల్సి ఉంది. ఎందుకంటే విశాఖ రాజధాని అని సీఎం జగన్ చెబుతున్నా..? విపక్షాలు మాత్రం అమరావతే రాజధాని అంటున్నాయి. ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..  Amaravati:  అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను.. త్వరితగతిన విచారించాలని.. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును ఇవాళ కోరారు.  ఈ మేరకు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ ధర్మాసనం దగ్గర ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐతే గతంలో కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని..  రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు కనీసం 2 వారాల సమయమివ్వాలని కోరారు.   దీంతో ఈ నెల 23న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపిందని చెబుతున్నారు. శాసనసభ నిర్ణయాలను తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రైతులు మాత్రం తమ ప్రయోజనాలకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రై...

Forbes list: కోనసీమ వండర్.. ఫోర్బ్స్‌ జాబితాలో తెలుగు యువకుడు

Image
 Konaseema Kurrodu: మరో జాతిరత్నం తెలుగు కీర్తిని రెప రెపలాడించేలా చేస్తున్నాడు. అతడే కోనసీమ కుర్రాడు.. తాజాగా అతడి ప్రతిభకు ఫోర్బ్స్ పట్టం కట్టింది.. ఎందుకో  తెలుసా..?  Konaseema Kurrodu: తెలుగు జాతి గర్వపడేలా చేశాడు మరో యువకుడు.. అది కూడా మన  కోనసీమకు చెందిన యువకుడే.. ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేసి.. ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్నారు. మెడికల్‌ ఇమేజింగ్‌లో ఏడేళ్లపైబడి అనుభవం ఉన్న యువకుడు ఇప్పటి వరకు 25 పైగా అంతర్జాతీయ ప్రచురణలు, రెండు పుస్తక అధ్యాయాలకు సహ రచన చేశారు. 23 అంతర్జాతీయ పేటెంట్లు పొందాడు. ఇతను చేస్తున్న పరిశోధనలను గుర్తించిన ఫోర్బ్స్‌ పత్రిక యువ సాధకుల జాబితాలో చోటు కల్పించింది. కోనసీమ జిల్లా ద్రాక్షారామకు చెందిన కాకిలేటి సూరిబాబు కుమారుడు శివతేజ ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన టాప్‌ 30 యువ సాధకుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.  ఐఐటీ గౌహటిలో ఈసీఈ మేజరు డిగ్రీగా, సీఎస్‌ఈ మైనర్‌ డిగ్రీగా ఏకకాలంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో నిరామయ్‌ అనే వైద్య సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొంతమంది భాగస్వామ్యంతో ప్రారంభించి రొమ్ము...

AP Elections 2024: సిక్కోలులో గెలుపు ఎవరిది? పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానల్లో టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరి బలం ఎంత?

Image
 AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ పెరిగింది. అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నాయి. మరి ఏపీలో చిట్టచివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో పరిస్థితి ఏంటి..? వైసీపీ, టీడీపీ, జనసేన ల్లో ఎవరి బలం ఎంత..? వచ్చే ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు..? AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు కోసం లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు అడుగులు వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు.. ప్రధాన పార్టల బలాలు ఎంటో తెలుసుకుందాం.. ఇందులో భాగంగా మొదట శ్రీకాకుళం జిల్లా లో రాజకీయ పరిస్థితి ఏంటో చూద్దాం.. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. బతుకులు మారడం లేదని అనుకుంటారు జనం ఇక్కడ. అలాంటి శ్రీకాకుళం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే.. ఉమ్మడి జిల్లాలో రాజకీయ ఆధిపత్యం ఎప్పటికప్పుడు చేతులు మారడం ఇక్కడ ప్రత్యేకత. మరి 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? పార్లమెం...